acrobatics

ఈ మ‌నిషి విన్యాసాలు చూసి షాక్ కావాల్సిందే

ఒక మ‌నిషి వెన‌క్కి తిర‌గ‌కుండా త‌న త‌ల వెన‌క్కి తిప్ప‌లేడు. అలాగే మ‌నిషి త‌న‌ చేతుల్ని 360 డిగ్రీల కోణంలో తిప్పాలనుకోవ‌డం అసాధ్యం అనే చెబుతారు. కానీ పంజాబ్‌కి చెందిన 17 ఏళ్ల జస్‌ప్రీత్‌సింగ్‌ కాల్రా ఇలాంటి అతి కష్టమైన ఫీట్లు ఎన్నింటినో సునాయాసంగా చేసి చూపిస్తాడు. అందుకే, అతడు మనదేశంలో కెల్లా ‘మోస్ట్‌ ఫ్లెక్సిబుల్‌ మ్యాన్‌’గా రికార్డులకెక్కాడు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే రెండో స్థానంలో ఉన్నాడు. 12 ఏళ్ల వయసులో యోగా చేస్తున్నప్పుడు తన శరీరం ఎటైనా సులభంగా వంగుతోందని గ్రహించిన జస్‌ప్రీత్‌.. యూట్యూబ్‌లో ప్రపంచంలోనే మోస్ట్‌ ఫ్లెక్సిబుల్‌ మ్యాన్‌గా గిన్నిస్‌ రికార్డుకెక్కిన డానియల్‌ బ్రౌనింగ్‌ విన్యాసాల్ని చూశాడు. అతడి వీడియోలను చూస్తూ తనూ అలా చెయ్యడం మొదలుపెట్టాడు. రెండు మూడేళ్లలోనే ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌తో పాటు ప్రపంచస్థాయిలో ఎన్నో రికార్డుల్ని సొంతం చేసుకున్నాడు. అతడి విన్యాసాల్ని చూస్తే ఒంట్లో అసలు ఎముకలున్నాయా అనిపిస్తోంది కదూ.. అందుకే జస్‌ప్రీత్‌ను అందరూ రబ్బరు మనిషి, బోన్‌లెస్‌ మ్యాన్‌ అని పిలుస్తున్నారు.

You might also like

Leave a Reply