Monday, 20 November, 2017

 అది క‌రెక్ట్ కాదు  : క‌మ‌ల్ హాస‌న్‌

క‌మ‌ల్ హాస‌న్‌తో బంధాన్ని ముగించేస్తున్న‌ట్టు గౌత‌మీ ప్ర‌క‌టించిన వెంట‌నే క‌మ‌ల్ హాస‌న్ కూడా ఒక ప్ర‌క‌ట‌న చేశార‌ని అంద‌రూ భావించారు.  మీడియాలో కూడా ఈ విష‌యాన్ని హైలైట్ చేశారు. కానీ ఆ ప్ర‌క‌ట‌న త‌ను  చేయ‌లేదంటున్నాడు క‌మ‌ల్ . గౌత‌మీతో విడిపోతున్న విష‌యం గురించి ఇప్పుడు మాట్లాడే ఉద్దేశ్యం లేద‌నే క్లారిటీ ఇచ్చాడు. ‘గౌత‌మీ తీసుకున్న  నిర్ణ‌యాన్ని గౌర‌విస్తాను. ఈ టైమ్‌లో నా ఇమోష‌న్స్ క‌న్నా.. గౌత‌మీ సంతోష‌మే నాకు ముఖ్యం. వారికి నా శుభాశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. వారికి ఏ  ఆప‌ద వ‌చ్చినా ముందు నేనుంటాను. ప్ర‌స్తుతం తండ్రిగా సంతోషంగా ఉంటానికి ప్రాధాత్య‌నిస్తా అంటూ క‌మ‌ల్ ఒక ప్ర‌క‌ట‌న చేసినట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్త‌ను చాలా మంది నిజం అనుకున్నారు. కానీ ఇది వాస్త‌వం కాద‌ని. ఎవ‌రో అనామ‌కులు ఇలాంటి ప‌ని చేశార‌ని ఇది క‌రెక్ట్ కాద‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

 

 

You might also like

Leave a Reply